Woman

ఈ ఒక్కటి పెట్టినా.. బ్లాక్ లిప్స్ ఎర్రగా అవుతాయి

దానిమ్మ గింజలు

ఒక అధ్యయనం ప్రకారం.. దానిమ్మ రసం డార్క్ స్కిన్ ను క్లీన్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.ఒక స్పూన్ దానిమ్మ గింజల్లో రోజ్ వాటర్, క్రీమ్ మిక్స్ చేసి పెదాలకు మసాజ్ చేయండి. 

బాదం నూనె

బాదం నూనె పెదవులను తేమగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. వారానికి మూడు, నాలుగు సార్లు శుద్ధి చేసిన బాదం నూనెను పెదవులకు అప్లై చేస్తే నల్లని పెదాలు ఎర్రగా అవుతాయి. 

తేనె, పంచదార

పెదాల చర్మాన్ని శుభ్రం చేయడానికి మీరు వారానికి ఒకసారి తేనె, పంచదారతో స్క్రబ్‌ చేయండి. ఇందుకోసం ఒక టీస్పూన్ పంచదారలో ఒక టీస్పూన్ తేనె కలిపి పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయండి.

కలబంద జెల్

రోజూ లేదా వారానికి 3 నుంచి 4 సార్లు పెదాలకు 20 నిమిషాల పాటు కలబంద జెల్ రాసి క్లీన్ చేయండి. ఇది మీ పెదవులను చాలా మృదువుగా చేస్తుంది. పెదవులు కూడా రెడ్ గా అవుతాయి. 

పసుపు,నిమ్మకాయ

పసుపు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అర టీస్పూన్ పసుపులో నిమ్మరసం వేసి కలిపి పెదాలకు అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయండి. 

సబ్బుతో కాదు, బంక మట్టితో స్నానం చేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా

పెదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నాయా?

పాకిస్తానీతో కలిసి.. లండన్ ట్రిప్ లో సారా టెండుల్కర్

కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే ఏమౌతుంది..?