Woman
బయోటిన్ గుడ్డు పచ్చసొనలో పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజూ మీరు ఒక గుడ్డు మొత్తాన్ని తింటే మీ జుట్టు బాగా పెరుగుతుంది.
బచ్చలికూరలో బయోటిన్ తో పాటుగా ఖనిజాలు, ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
పుట్టగొడుగుల్లో కూడా బయోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
చిలగడదుంపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు కూడా మంచి మేలు చేస్తాయి తెలుసా? దీనిలో బయోటిన్ మెండుగా ఉంటుంది. ఇది తింటే జుట్టు బాగా పెరుగుతుంది.
అవొకాడో కూడా జుట్టు పెరగడానికి, హెల్తీగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. ఇది కూడా బయోటిన్ కు మంచి వనరు.
బాదం పప్పుల్లో రకరకాల పోషకాలతో పాటుగా బయోటిన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బాదం పప్పులను రోజూ తింటే మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మీ జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది.
ఆరోగ్య నిపుణుల లేదా పోషకాహార నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి.