ఈ 5 చిట్కాలతో కొరియన్లలా అందంగా కనిపిస్తారు..40లో కూడా 20 ఏండ్ల వారిలా
ఫేస్ వాష్
మీ స్కిన్ మెరవాలంటే మాత్రం ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఉదయం-సాయంత్రం ఫేస్ వాష్ బాగా చేయాలి. మీ స్కిన్ ను సరిపోయే ఫేస్ వాష్ ఏంటో డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి.
నూనెతో ముఖానికి మసాజ్
ముఖానికి నూనె పెట్టి మసాజ్ చేస్తే మీ ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ వారంలో రెండు రోజులు మాత్రమే ఇలా ముఖానికి నూనె పెట్టాలి.
బియ్యం పిండి మాస్క్
కొరియన్ల లాంటి మచ్చలేని స్కిన్ పొందాలంటే మాత్రం బియ్యం పిండి మాస్క్ ను వేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది. ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది.
పాలు, తేనె
కొరియన్లలాంటి ఫేస్ కావాలంటే మీరు పాలు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది కొరియన్ క్లెన్సర్ లా పనిచేస్తుంది. మీ ముఖాన్ని అందంగా చేస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీతో కూడా మీరు కొరియన్ గ్లాస్ స్కిన్ ను పొందుతారు. ఇందుకోసం గ్రీన్ టీ తాగాలి. ఆయిలీ చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.