Woman
హెవీ జుంకాలు అందంగా ఉంటాయి. కానీ, వాటిని పెట్టుకుంటే.. చెవులు సాగిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేాయాలో చూద్దాం..
బరువైన జుంకాల బరువును తగ్గించడానికి సిలికాన్ ఇయర్ సపోర్ట్‌లను (ear lobe pads) ఉపయోగించండి. ఇవి జుంకాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, మీ చెవులు వేలాడకుండా ఉంటాయి.
జుంకాల బ్యాక్ స్టాపర్ స్థానంలో డబుల్ స్టాపర్‌ను ఉపయోగించండి. ఇది జుంకాను సరైన స్థానంలో ఉంచుతుంది, వేలాడకుండా కాపాడుతుంది.
చెవి క్లిప్ ఉన్న జుంకాలను ఎంచుకోండి. దీని వల్ల జుంకా చెవి రంధ్రం మీద మాత్రమే కాకుండా, మొత్తం చెవిపై బ్యాలెన్స్‌గా ఉంటుంది.
చూడటానికి హెవీగా ఉన్నా.. తేలికైన బంగారు జుంకాలు దొరుకుతాయి. వాటి వల్ల చెవులకు ఎలాంటి సమస్య ఉండదు.
బరువైన జుంకాలను ఎక్కువసేపు ధరించకండి. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే వీటిని ఎంచుకుని, సందర్భం ముగిసిన వెంటనే తీసేయండి. పడుకునే ముందు, స్నానం చేసే ముందు బరువైన జుంకాలను తీసేయండి.
జుంకాలు ధరించే ముందు, తర్వాత చెవులకు మసాజ్ చేయండి. బాదం నూనె, కొబ్బరి నూనె లేదా ఏదైనా మాయిశ్చరైజర్ రాసి చెవులకు విశ్రాంతి ఇవ్వండి.