అనుష్క శర్మ జుట్టు చాలా సిల్కీగా అందంగా ఉంటుంది. ఆమె జుట్టు కోసం స్పెషల్ హెయిర్ మాస్క్ వాడతారట. అదే.. బనానా హెయిర్ మాస్క్.
బనానా హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
రెండు పండిన అరటిపండ్లు, అరకప్పు పాలు లేదా పెరుగు , 1-2 టీస్పూన్ల తేనె ఈ హెయిర్ మాస్క్ కోసం అవసరం. మీ జుట్టు పొడవును బట్టి పరిమాణాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు.
హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి
ముందుగా అరటిపండ్లను మెత్తగా చేయాలి. పేస్ట్ చాలా స్మూత్ గా చేసి దీనికి పాలు లేదా పెరుగు, తేనె కలపాలి. మీరు కావాలనుకుంటే మూడింటినీ ఒకేసారి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవచ్చు.
జుట్టుకు పట్టించాలి
ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. దీన్ని 30-40 నిమిషాలు జుట్టుకు పట్టించి ఉంచాలి. గోరువెచ్చని నీటితో , తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
ఎలా పనిచేస్తుంది
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ తల చర్మాన్ని శాంతపరుస్తుంది. దురదను తగ్గిస్తుంది. దీనితో పాటు తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.
ఎప్పుడు వేసుకోవాలి?
ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకసారి ఉపయోగించండి. క్రమం తప్పకుండా వేసుకుంటే చుండ్రు తగ్గుతుంది, జుట్టు బలంగా , మెరిసేలా ఉంటుంది.