Woman
పిండి ఇడ్లీ స్టాండ్ కు అంటుకోకుండా ఉండటానికి కాటన్ క్లాత్ బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కాటన్ గుడ్డను నీళ్లలో తడిపి ఇడ్లీ స్టాండ్ ప్లేట్ల మీద పెట్టండి.
కాటన్ క్లాత్ ను ఇడ్లీ స్టాండ్ ప్లేట్లమీద వేసిన తర్వాత పిండిని పోయండి. అయితే పిండిని మరీ ఎక్కువగా పోయకండి.
తడి కాటన్ క్లాత్ మీద ఇడ్లీను పోయడం వల్ల స్టాండ్ కు పిండి అంటుకోదు. దీనివల్ల స్టాండ్ శుభ్రంగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ.
కాటన్ క్లాత్ మీద వేసిన ఇడ్లీలు బాగా ఉడుకుతాయి. అలాగే క్లాత్ కూడా తేలిగ్గా వస్తుంది. ముఖ్యంగా ఈ ఇడ్లీలు అస్సలు చిరిగిపోవు.
ఈ చిట్కా గనుక ఫాలో అయితే మీరు ఇడ్లీ స్టాండ్ ను శుభ్రం చేయడానికి తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు. అలాగే తక్కువ టైంలోనే క్లీనింగ్ అయిపోతుంది.
మీరు గనుక ఈ పద్దతిని ఫాలో అయితే సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇడ్లీలు కూడా చక్కగా వస్తాయి.
200ఏళ్లనాటి నగలు, చీరలో నీతా అంబానీ.. ప్రత్యేకతలెంటో తెలుసా?
హెవీ జుంకాలు పెట్టినా చెవులు సాగకూడదంటే ఏం చేయాలో తెలుసా?
ఇవి తింటే అందం పెరుగుతుందా?
కాఫీని ఇలా వాడితే జుట్టు మెరవడం పక్కా