అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి అతిథులు హాజరయ్యారు. వారిలో నీతా అంబానీ ప్రత్యేకంగా నిలిచారు.
కాంచీపురం చీరలో..
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కాంచీపురం సిల్క్ చీర ధరించి ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ చీర కాంచీపురం ఆలయ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.
18వ శతాబ్దపు నగలు
ఈ చీర అందాన్ని మరింత పెంచేలా నీతా 18వ శతాబ్దపు ఆభరణాలు ధరించారు. భారత సంస్కృతిని ప్రపంచానికి చాటారు.
ఈ చీర డిజైనర్ ఎవరంటే?
మాస్టర్ వీవర్, పురస్కార గ్రహీత బి. కృష్ణమూర్తి ఈ చీరను రూపొందించారు. చీరపై నెమలి, జంతువుల బొమ్మలు ఆకర్షణగా నిలిచాయి.
200 ఏళ్ల పెండెంట్
నీతా ధరించిన నెక్లెస్‌లో 200 ఏళ్ల నాటి దక్షిణ భారత పెండెంట్ ఉంది. ఇది పచ్చలు, రూబీలు, వజ్రాలతో పొదిగి ఉంది.
బ్లౌజ్ మరింత ప్రత్యేకం
నీతా ధరించిన కాంచీపురం చీరకు మనీష్ మల్హోత్రా వెల్వెట్ డిజైన్డ్ బ్లౌజ్ మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.