Telugu

Glowing Skin: హీరోయిన్లలా క్లియర్ స్కిన్ కావాలా? ఈ డ్రింక్ తాగితే చాలు

Telugu

ఉసిరి, బీట్రూట్, క్యారెట్ జ్యూస్...

ప్రతిరోజూ ఉసిరి, బీట్రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకొని తాగితే.. మీ చర్మం మెరుస్తూ, కాంతివంతంగా కనపడుతుంది. దీనిని ఏబీసీ జ్యూస్ అని కూడా పిలుస్తారు. 

Image credits: Getty
Telugu

పండ్లు లేదా తేనె తినండి

రిఫైన్డ్ షుగర్‌కు బదులుగా పండ్లు లేదా స్వచ్ఛమైన తేనె వాడండి. ఎక్కువ చక్కెర ఉన్న ఆహారం తింటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది చర్మానికి మంచిది కాదు.

Image credits: Unsplash
Telugu

సాల్మన్, కనగర్త, మత్తి చేపలు

ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి చాలా అవసరం. సాల్మన్, కనగర్త, మత్తి వంటి కొవ్వు చేపలు తినాలి. అలాగే అవకాడో, వాల్‌నట్స్, చియా సీడ్స్ కూడా డైట్‌లో చేర్చుకోండి.

Image credits: Getty
Telugu

రోజూ తగినన్ని నీళ్లు తాగాలి

శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి,  మొటిమలు రాకుండా కాపాడుతుంది.

Image credits: Freepik
Telugu

గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు తాగండి

కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలు ఎక్కువగా తాగొద్దు. వాటికి బదులుగా గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు లేదా పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోండి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.

Image credits: Getty
Telugu

రోజూ వ్యాయామం చేయండి

ప్రతిరోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.

Image credits: Getty

Diamond Rings: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే డైమండ్ రింగ్స్

Mangalsutra: ఎర్రపూసల కాంబినేషన్ లో మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో

Cotton Nighties: ట్రెండీ డిజైన్‍లో కాటన్ నైటీలు.. సమ్మర్ కి బెస్ట్

Gold Chain: 5 గ్రాముల్లోనే అదిరిపోయే చైన్లు..అక్షయ తృతీయకు కొనేయండి