Woman
జుట్టు పెరగడానికి మాత్రమే కాదు, చుండ్రు తగ్గించడంలోనూ మెంతులు సహాయపడతాయి. దీనిలోని అమైనా ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి.
ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే దాన్ని పేస్ట్‌లా చేసి తలకు రాసుకోవాలి. 45 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
మెంతులు, గుడ్డు పచ్చసొన కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యానికి, మెరుపుకు మంచిది.
ఒక కప్పు బియ్యం కడిగిన నీటిలో 20 గ్రాముల మెంతులు రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే మెంతులను వడగట్టి, ఆ నీటిని తడి జుట్టుకు స్ప్రే చేసుకోవాలి.
నీటిలో నానబెట్టిన మెంతులు, కరివేపాకు కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు రాసుకుంటే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
మెంతులు, అరటిపండు కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు పెరుగుదలకు ఈ ప్యాక్ సహాయపడుతుంది.
మెంతులు, కలబంద జెల్ కలిపి జుట్టుకు రాసుకుంటే మంచిది.