లిగ్నాన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలు ఈస్ట్రోజెన్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. పీరియడ్స్ సరిగా వచ్చేలా చేసి, PCOS లక్షణాలను తగ్గిస్తాయి.
ఆవకాడో
ఆవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇవి హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది శరీరంలోని వాపును తగ్గిస్తుంది, హార్మోన్ల సమతుల్యతకు ఇది చాలా ముఖ్యం.
ఆకుకూరలు
పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గించి, కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది, మొత్తం హార్మోన్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
గింజలు, నట్స్
బాదం, వాల్‌నట్స్, చియా గింజలు, గుమ్మడి గింజల్లో కొవ్వు ఆమ్లాలు, పోషకాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తాయి, హార్మోన్ల సమతుల్యతకు కీలకం.
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపును తగ్గించి, పీరియడ్ పెయిన్స్ కూడా తగ్గిస్తాయి.
పసుపు
పసుపులోని కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను తగ్గించి, PCOS, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు ఉపశమిస్తుంది.
చేపలు
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు శరీరంలోని వాపును తగ్గించి, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలను నియంత్రిస్తాయి.