Woman

ఉప్పు, నిమ్మకాయతో.. గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలు ఇంత తొందరగా పోతాయా

Image credits: social media

ఈనో- ఉప్పు

ఒక గిన్నె తీసుకుని అందులో ఈనో, ఉప్పు వేసి బాగా కలపండి. దీంట్లో కొద్దిగా డిష్ వాషింగ్ డిటర్జెంట్ వేసి పేస్ట్ చేయండి. తర్వాత స్టవ్ మరకలపై దీన్ని రుద్ది శుభ్రం చేయండి. 

వెనిగర్- బేకింగ్ సోడా

వెనిగర్, బేకింగ్ సోడాను సమాన పరిమాణంలో తీసుకుని స్టవ్ మరకలపై రుద్దండి. 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేయండి. 

నిమ్మకాయ - ఉప్పు

ఒక నిమ్మకాయను తీసుకుని సగానికి కోయండి. దీనికి ఉప్పును చల్లండి. దీన్ని గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలపై రుద్దండి. ఇది మరకలను పోగొట్టి కొత్తదానిలా మెరిసేలా చేస్తుంది. 

ఉప్పు, సబ్బు - వేడి నీరు

ముందుగా వేడి నీటిలో డిష్ వాషింగ్ డిటర్జెంట్ ను, ఉప్పును వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని గ్యాస్ స్టవ్ పై రుద్ది స్క్రబ్బర్ తో శుభ్రం చేయండి.

బేకింగ్ సోడా - పెరాక్సైడ్

బేకింగ్ సోడాలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను వేసి పేస్ట్ లా చేయండి. దీన్ని స్టవ్ మరకలపై రుద్దండి. 15-20 నిమిషాల తర్వాత తడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. మరకలన్నీ పోతాయి.

వెనిగర్ - డిటర్జెంట్

వెనిగర్ లో డిటర్జెంట్ ను కలిపి మరకలున్న చోట స్ప్రే చేయండి. 10 నిమిషాలు తర్వాత రుద్ది క్లీన్ చేస్తే ఒక్క మరక లేకుండా పోతాయి. 

Find Next One