ముఖంపై ముడతలు, మొటిమలు పోవాలంటే ఓట్స్ ఫేస్ ప్యాక్ వాడటం మంచిది. ఓట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు ముడతలను నివారించి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సాయపడతాయి.
రెండు చెంచాల ఓట్స్, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
రెండు చెంచాల ఓట్స్‌లో ఒక చెంచా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
రెండు చెంచాల ఓట్స్‌లో అర చెంచా పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
పండిన బొప్పాయి గుజ్జులో 2 చెంచాల ఓట్స్, 1 చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ఒక చెంచా కలబంద గుజ్జు, రెండు చెంచాల ఓట్స్ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
మహిళల్లో కాల్షియం లోపం ఉందని గుర్తించేదెలా?
జీబ్రా ప్రింట్ సారీస్.. వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి
10 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. కొత్త పెళ్లికూతుర్లకు బెస్ట్ ఆప్షన్
ఈ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ తో అద్భుతమైన లుక్ మీ సొంతం