Woman

మందార పువ్వును ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా

మందార పువ్వు

మందార పువ్వు మన చర్మాన్ని అందంగా మార్చేస్తుంది. ఈ పువ్వుతో చేసిన ఫేస్ మాస్కులను ఉపయోగించడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అవేంటంటే? 

మందార పువ్వు

మందార పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పువ్వు హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే మన చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. 

పెరుగు, మందార ఫేస్ మాస్క్

ఫేస్ మాస్క్ కోసం రెండు మందార పువ్వులను మెత్తని పేస్ట్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి కలిపి ముఖానికి పెట్టండి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మచ్చలు తగ్గిపోతాయి. 

మందార, కలబంద ఫేస్ మాస్క్

 మందార పేస్ట్ లో కలబంద గుజ్జును వేసి కలిపితే ఫేస్ మాస్క్ రెడీ అయినట్టే. దీన్ని ముఖానికి పెట్టడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అలాగే కలబందలోని ఫైటోకెమికల్స్ ఎరుపును తగ్గిస్తాయి.

తేనెతో మందారం

చలికాలంలో మన చర్మం డ్రైగా మారుతుంది. అయితే మందార పొడిలో తేనె వేసి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం తేమగా ఉంటుంది. దీంతో డ్రై స్కిన్ సమస్య ఉండదు.

మందారం, ముల్తానీ మట్టి

ముఖంపై ఉన్న ముడతలను, ఎండవల్ల కలిగిన చర్మ నష్టాన్ని తగ్గించడంలో ఈ ఫేస్ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మందార పొడిలో ముల్తానీ మట్టిని వేసి పేస్ట్ చేసి ముఖానికి పెట్టాలి.

పాలు, మందార ఫేస్ మాస్క్

వృద్ధాప్యం వల్ల వచ్చే ముడతలను తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం మందార పేస్ట్‌లో రెండు టీస్పూన్ల పాలను కలిపి ముఖానికి పెట్టండి. ఇది చర్మాన్ని అందంగా చేస్తుంది. 

ముక్కుపై నల్ల మచ్చలు పోవడానికి ఇదొక్కటి చేస్తే చాలు

గులాబీ పువ్వులతో లిప్ బామ్ ను ఎలా చేయాలో తెలుసా?

ఇలా చేస్తే మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి

చీర, లెహంగా కి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్