మీరు గనుక ప్రతిరోజూ హెవీగా మేకప్ వేసుకుంటే మీ నేచురల్ స్కిన్ గ్లో తగ్గుతుంది. కెమికల్ మేకప్స్ వల్ల చర్మం పొడిబారుతుంది. డల్ గా కనిపిస్తుంది.
పౌడర్, ఫౌండేషన్, కన్సీలర్లను వాడితే చర్మ రంధ్రాలు మూసుకుపోయి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, మొటిమలు వస్తాయి.
మేకప్ లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి. వీటివల్ల చిన్న వయసులోనే ముడతలు, గీతలు ఏర్పడి మీరు పెద్దవయసు వారిలా కనిపిస్తారు.
ముఖానికి మేకప్ ను సరిగ్గా రిమూవ్ చేయకపోతే గనుక చర్మంపై బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు, అలెర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
మేకప్, రిమూవర్లు మీ స్కిన్ లోని నేచురల్ ఆయిల్స్ ను తగ్గిస్తాయి. దీంతో మీ స్కిన్ పొడిబారి మరింత సున్నితంగా అవుతుంది.
రోజరోజూ మేకప్ వేసుకోవడం సమయం తీసుకుంటుంది, ఖర్చుతో కూడుకున్నది. మేకప్ లేకుండా ముఖం చూపించలేమనే భావన వల్ల ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు.
ఈ పండ్లు తింటే ముఖంపై ముడతలు ఏర్పడవు.. యవ్వనంగా కనిపిస్తారు
ఇదొక్కటి పెట్టినా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి
గ్యాస్ స్టవ్ ను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతుంది
రోజూ ఈ ఫుడ్స్ తింటే.. జుట్టు రాలమన్నా రాలదు..!