Woman

ప్రతి స్త్రీ దగ్గర కచ్చితంగా ఉండాల్సిన కాటన్ చీరలు ఇవి

ఖాదీ కాటన్ చీరలు

ఖాదీ కాటన్ చీరలు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. భారతీయ చరిత్ర, ప్రతీకకు చిహ్నం అని చెప్పొచ్చు. సమ్మర్ కి బెస్ట్ 

 

సంబల్పూర్ కాటన్ చీర

సంబల్పుర్ కాటన్ చీరలు వాటి అందమైన రంగులు , సాంప్రదాయ ప్రింట్లకు ప్రసిద్ధి చెందాయి. వీటిని బంధ అనే ప్రత్యేకమైన టై-డై టెక్నిక్‌తో తయారు చేస్తారు.

చందేరి కాటన్ చీర

మధ్యప్రదేశ్‌లోని చందేరి చీరలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కాటన్ చీరలను కూడా చేతితో తయారు చేస్తారు.

జామ్దానీ కాటన్ చీరలు

బెంగాల్ నుండి వచ్చే జామ్దానీ కాటన్ చీరలను క్లిష్టమైన నమూనాలతో చేతితో నేస్తారు. ఈ చీరలు చాలా సున్నితంగా ఉంటాయి, కాబట్టి వీటికి విలువ ఎక్కువ.

కోట డోరియా కాటన్ చీర

కోట డోరియా చీర రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందింది. ఈ చీరలలో ప్రత్యేకమైన చెక్స్ నమూనాలు , తేలికపాటి  క్లాత్ ని  ఉపయోగిస్తారు.

చెట్టినాడ్ కాటన్ చీరలు

చెట్టినాడ్ కాటన్ చీరలు ముదురు రంగులు , ఆకర్షణీయమైన నమూనాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ చీరలు ప్రధానంగా తమిళనాడులో తయారవుతాయి. ఈ చీరలు కాస్త మందంగా , మన్నికగా ఉంటాయి.

గద్వాల్ కాటన్ చీరలు

గద్వాల్ కాటన్ చీరలు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతాయి. ఇవి పత్తితో తయారవుతాయి. వీటి అంచు  భాగంలో పట్టు , జరీ పని ఉంటుంది.

పోచంపల్లి కాటన్ చీర

పోచంపల్లి చీరలు ఇక్కత్ నమూనాలకు ప్రసిద్ధి చెందాయి. తెలంగాణకు చెందిన ఈ చీరలు స్టైలిష్‌గానూ, ధరించడానికి బాగుంటాయి. ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇవ్వాలనుకునే వారికి బాగా సూటౌతాయి.

ఉప్పు, నిమ్మకాయతో.. గ్యాస్ స్టవ్ పై ఉన్న మరకలు ఇంత తొందరగా పోతాయా

పండగవేళ చీరలో మెరవాలా? కృతిని ఫాలో అవ్వాల్సిందే

ముఖానికి కరివేపాకును ఇలా పెడితే పండగ వేళ అందంగా కనిపిస్తారు

దీనివల్లే.. నీతా అంబానీ, దీపికా అందంగా ఉన్నారా