రింగుల జుట్టు ఉన్నవారు వెడల్పాటి పళ్ల దువ్వెన వాడాలి. దీని వల్ల జుట్టు తక్కువగా రాలుతుంది. తడి జుట్టుకు పెద్ద పళ్ల దువ్వెన వాడటం సురక్షితం.
పొడవాటి, దట్టమైన జుట్టు చిక్కులను సులభంగా తీయడానికి ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా పాడిల్ బ్రష్ వాడండి. ఇది జుట్టుకు స్ట్రెయిట్ లుక్ ఇస్తుంది.
పల్చని జుట్టు కోసం చెక్క దువ్వెన లేదా సాఫ్ట్ పాడిల్ బ్రష్ వాడండి. దీనివల్ల జుట్టు అంటుకుపోదు, తల చర్మానికి కూడా హాని జరగదు. ప్లాస్టిక్ దువ్వెనను మాత్రం వాడకండి.
మీ జుట్టు పూర్తిగా స్ట్రెయిట్‌గా ఉండి, స్మూత్‌గా కనిపించాలనుకుంటే, సన్నని పళ్ల దువ్వెన వాడండి. తడి జుట్టు మీద దీన్ని వాడొద్దు, జుట్టు ఆరిన తర్వాతే దువ్వాలి.
తడి జుట్టును దువ్వడానికి వెడల్పాటి పళ్ల దువ్వెన వాడాలి. కావాలంటే చెక్క దువ్వెన వాడొచ్చు, దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు చిక్కు కూడా పడదు.
హెయిర్ స్టైలింగ్ కోసం ఎప్పుడూ రౌండ్ బ్రష్ వాడాలి. ఇవి బ్లో డ్రైకి ఉత్తమంగా ఉంటాయి. ఈ దువ్వెన వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, బౌన్సీగా కనిపిస్తుంది.
జుట్టును సరిగ్గా పాపిడి తీయడానికి లేదా హెయిర్ స్టైలింగ్ కోసం రాట్ టెయిల్ దువ్వెన వాడండి. దీనితో పాపిడి సరిగ్గా వస్తుంది, జడ సరిగ్గా వేసుకోవచ్చు, స్లీక్ బన్ కూడా వేసుకోవచ్చు.