రూ.500 లోపే మీరు చక్కని మేకప్ కిట్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా
ఫౌండేషన్ కాంబో
ప్రస్తుతం మార్కెట్లో ప్రైమర్, ఫౌండేషన్, సీరం కలిగిన కాంబో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. రూ.250లకే ఫౌండేషన్ కాంబో ప్యాక్‌ను కొనండి.
కాజల్, ఐలైనర్
వాటర్‌ప్రూఫ్, ఎక్కువ సమయం మన్నిక కలిగిన మంచి కంపెనీ కాజల్ మీకు రూ.50 లోపు సులభంగా లభిస్తుంది. అదేవిధంగా రూ.150 లోపు ఐలైనర్‌ను కొనండి.
లిప్‌స్టిక్
మీ మేకప్ కిట్‌లో మ్యాట్, లిక్విడ్ లిప్‌స్టిక్‌లు తప్పనిసరిగా ఉండాలి. మీకు నచ్చిన రంగును ఎంచుకోండి. బ్రాండెడ్ లిప్‌స్టిక్‌లు మీకు రూ.100 లోపు సులభంగా లభిస్తాయి.
మస్కారా
ఇలా మీ బేసిక్ మేకప్ కిట్ రూ.500 లోపు సిద్ధమైపోతుంది. మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే రూ.200 లోపు బ్రాండెడ్ మస్కారాను కొనుగోలు చేయవచ్చు. లేదా వాజులైన్ కూడా ఉపయోగించవచ్చు.
హైలైటర్
రూ.200 లోపే హైలైటర్ లభిస్తుంది. ఇది మీ ముఖం కాంతిని రెట్టింపు చేస్తుంది. మీ బడ్జెట్‌ను కొద్దిగా పెంచితే మీ మేకప్ కిట్ మీకు మరింత అందాన్నిస్తుంది.
బీబీ క్రీమ్ తో ఖర్చు తగ్గుతుంది
మీరు బ్రాండెడ్ బీబీ క్రీమ్‌ను మీ చర్మంపై అప్లై చేస్తే ఫౌండేషన్ అవసరం ఉండదు. మీరు రూ.75 లోపు మంచి కంపెనీ బీబీ క్రీమ్‌ను కొనుగోలు చేయవచ్చు.