కలబంద జెల్ లో కొంచెం పసుపును వేసి ప్యాక్ గా చేయండి. ఇది మీ ముఖానికి మంచి గ్లోను ఇస్తుంది.
కలబంద జెల్ లో కొంచెం రోజ్ వాటర్ ను వేసి మెత్తని పేస్ట్ చేసి ముఖానికి పెడితే మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది.
కలబందలో తేనెను మిక్స్ చేసి ముఖానికి పెడితే ముఖం కాంతివంతంగా అవుతుంది.
మీరు కలబంద జెల్లో నిమ్మరసాన్ని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు.
కలబంద గుజ్జులో మీరు కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే మీ ముఖం తేమగా ఉంటుంది.
కలబంద గుజ్జులో అరటిపండును వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి పెట్టి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
మీరు గ్రీన్ టీని కలబంద జెల్ లో మిక్స్ చేసి ముఖానికి పెడితే మీ ముఖం అందంగా అవుతుంది.
ఓట్స్ మంచి స్క్రబ్బర్ లా కూడా పనిచేస్తాయి. మీరు కలబంద జెల్ లో ఓట్స్ ను వేసి మెత్తని పేస్ట్ చేసి ముఖానికి పెట్టొచ్చు.
ఒక్క కలబంద జెల్ ను కూడా మీరు ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు. ఇది మీ చర్మం మెరిసేలా చేస్తుంది. చర్మ సమస్యలనూ తగ్గిస్తుంది.
ఫెస్టివల్ లుక్ ని రెట్టింపు చేసే కుందన్ ఇయర్ రింగ్స్
పెళ్లైన మహిళల మనసు దోచే మెట్టెలు
జస్ట్ 500 రూపాయలకే ఇంత మంచి ఉంగరాలు దొరుకుతాయా
తక్కువ ధరకే బ్లౌజ్ ను అందంగా మార్చాలంటే ఇలా చేయండి