Woman
సాయిపల్లవి కట్టుకున్న ఈ పింక్ కంచిపట్టు చీర ఎంతో అందంగా ఉంది. ఇలాంటి చీరలు కొత్త పెళ్లి కూతుర్లకి బాగా సూటవుతాయి.
స్కైబ్లూ కలర్ ఆర్గాంజా చీరలో సాయి పల్లవి ఎంత అందంగా ఉందో కదా. మీ లుక్ బాగుండాలంటే ఇలాంటి చీరను ట్రై చేయండి. ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో బాగుంటుంది. పార్టీలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
గోల్డ్, రెడ్ కాంబినేషన్ లో ఉన్న ఈ కాటన్ సిల్క్ చీరలో సాయి పల్లవి ఎంత అందంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి చీర పండగలకి బాగా సరిపోతుంది.
లైట్ పింక్ కంచిపట్టు చీర పెళ్లిళ్లకి, ఫంక్షన్లకి బాగుంటుంది. ఈ చీరమీదికి హెయిర్ ని లీవ్ చేయండి. జడ అల్లకండి.
ఇలాంటి కసవు చీరలో మీరు సాయి పల్లవిలా ఎంతో అందంగా కనిపిస్తారు.
ఈ ఫ్లోరల్ ప్రింట్ చీర ఆఫీస్‌కి, పార్టీలకు బాగా సరిపోతుంది. ఈ లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ చీరమీదికి స్లీవ్‌లెస్ జాకెట్ బాగుంటుంది.
ఈ చీరలో సాయి పల్లవి ముఖం తారలా వెలిగిపోతుంది. నిజానికి సాయి పల్లవికి కంచిపట్టు చీరలంటే చాలా ఇష్టం. ఇలాంటి చీరలు పెళ్లిళ్లకి బాగుంటాయి.
సిల్వర్ జరీతో ఈ పర్పుల్ కంచిపట్టు చీరలో సాయి పల్లవి ఎంతో అందంగా ఉంది కదూ. ఈ చీర 10-15 వేల లోపే దొరుకుతుంది.