చెమటకు తల దురద పెడుతోందా? ఇవి ట్రై చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది
woman-life May 07 2026
Author: Nandini Arava Image Credits:Freepik
Telugu
తలను శుభ్రంగా ఉంచుకోండి
ఉక్కపోత ఎక్కువున్నప్పుడు. వాతావరణంలో తేమ ఎక్కువున్నప్పుడు చెమట కూడా ఎక్కువ పడుతుంది. అందుకే, మీ జుట్టు బట్టి వారానికి 2-3 సార్లు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం మంచిది.
Image credits: Getty
Telugu
సరైన షాంపూ, కండిషనర్ వాడండి
సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూలను వాడండి. కండిషనర్‌ను తల మాడుకు కాకుండా, జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయడం ఉత్తమం.
Image credits: Getty
Telugu
జుట్టును ఆరబెట్టండి:
స్నానం చేసిన వెంటనే తడి జుట్టును కట్టేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, జుట్టును సహజంగా లేదా హెయిర్ డ్రైయర్‌తో పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే ముడి వేసుకోవాలి.
Image credits: Getty
Telugu
స్కాల్ప్ డిటాక్స్ (Scalp Detox):
వారానికి ఒకసారి ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా ప్రత్యేకమైన స్కాల్ప్ స్క్రబ్ ఉపయోగించి తల మాడుపై ఉన్న మురికిని, మలినాలను తొలగించండి.
Image credits: Getty
Telugu
నూనెను వాడొద్దు
తలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నూనె ఎక్కువగా రాస్తే, అది మరింత మురికిని ఆకర్షిస్తుంది. కాబట్టి, స్నానానికి అరగంట ముందు మాత్రమే నూనెతో మసాజ్ చేసుకోవడం మంచిది.
Image credits: Getty
Telugu
సరైన దువ్వెన వాడండి:
వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు ఊడటం తగ్గించొచ్చు. మీ దువ్వెనలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
Image credits: Getty
Telugu
ఆహారం, నీళ్లు చాలా ముఖ్యం:
తగినంత నీరు తాగడం వల్ల మీ చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి, ఇ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.