Travel
రాజస్థాన్ లోని నాథ్ ద్వార వద్ద నిర్మించిన 351 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుని విగ్రహం.
ఒడిశాలోని భంజనగర్‌లో 61 అడుగుల చంద్రశేఖర్ మహాదేవ్ విగ్రహాన్ని 2013లో స్థాపించారు. మహాశివరాత్రి ఇక్కడ బాగా జరుగుతుంది.
కర్ణాటకలోని బీజాపూర్‌లో 85 అడుగుల ఎత్తైన తెల్లని శివుని విగ్రహం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ దగ్గర 100 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.
జబల్పూర్‌లోని 76 అడుగుల విగ్రహంలో 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు కూడా ఏర్పాటుచేశారు. అందువల్ల అన్నీ ఒకేచోట చూడొచ్చు.
నేపాల్‌లోని 143 అడుగుల కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహం భక్తిని, ఆ ప్రాంత గొప్పతనాన్ని చాటి చెబుతుంది.
బెంగళూరులోని కెంప్ ఫోర్ట్ ప్రాంతంలో 65 అడుగుల పద్మాసనంలో ఉన్న శివుని విగ్రహం వద్ద ధ్యానం చేస్తే బాగుంటుంది.
అరేబియా సముద్రం సమీపంలోని మురుడేశ్వర్‌లో 124 అడుగుల శివుడి విగ్రహం చూడటానికి రెండు కళ్ళు చాలవు.
గుజరాత్‌లోని నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయ సముదాయంలో 82 అడుగుల శివుడి విగ్రహం చాలా బాగుంటుంది.
సిద్ధేశ్వర ధామ్‌గా ప్రసిద్ధి చెందిన సిక్కింలోని నమ్చిలో 108 అడుగుల విగ్రహం శివుని విగ్రహం రమణీయంగా ఉంటుంది.