Travel
సరస్సుల నగరమని, 'తూర్పు వెనిస్' అంటూ పిలిచే ఈ నగరం పేరు ఉదయపూర్. ఇది పర్యాటకులకు ఎంతో ఇష్టమైన నగరంగా పేరు పొందింది.
ఉదయపూర్ లో సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, సజ్జన్‌గఢ్, ఫతే సాగర్, ఏక్లింగ్జీ ఆలయం, తదితర ఫేమస్ భవనాలు ఉన్నాయి. వీటిని తప్పకుండా చూడాలి.
ఈ నగరం ఎందుకు ఫేమస్ అంటే. ఇక్కడ చేతి పనులు చేసే వారు ఎక్కువ. అలాంటి ఉత్పత్తుల్లో ఖాదీ వస్త్రాలు చాలా హైలైట్ గా కనిపిస్తాయి.
ఇక్కడ సంస్కృతిని చూడటానికైనా కచ్చితంగా ఉదయ్‌పూర్‌ను సందర్శించాలి. ఇక్కడ మీరు సాంప్రదాయ నృత్యం, సంగీతం, రుచికరమైన రాజస్థానీ వంటలను రుచి చూడవచ్చు.
మీరు ఈ నగరంలో సిటీ ప్యాలెస్, లేక్ పిచోలా, సజ్జన్‌గఢ్ వంటి ఫేమస్ ప్లేస్ లను చూడొచ్చు. ఇక్కడ చరిత్ర, సంస్కృతి, సహజ సౌందర్యమైన ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి.
మీరు ఉదయ్‌పూర్ రావాలంటే ఫ్లయిట్ బెటర్. ఈ సిటీకి 50 కి.మీ దూరంలో ఉన్న డాబోక్ విమానాశ్రయం ఉంది. ఎక్కడి నుంచైనా ఇక్కడికి చేరుకోవచ్చు.
హై-స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉదయ్‌పూర్ కి ఉంది. మీరు ఈ నగరానికి చేరుకోవడానికి రైలు ప్రయాణం కూడా సులభంగా ఉంటుంది.