Travel
పచ్చని తోటలు, అందమైన సరస్సులు, దట్టమైన అడవులతో ఊటీ చాలా అందంగా ఉంటుంది. చల్లని, ప్రశాంతమైన వాతావరణం మీకు ప్రశాంతతను అందిస్తుంది.
కాఫీ తోటలు, పొగమంచుతో ఉండే కొండలు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం కూర్గ్. అడ్వన్చర్ పాటు రిలాక్షేషన్ కోరుకొనే వారికి ఇది కరెక్ట్ ప్లేస్.
విస్తారమైన టీ తోటలు, పొగమంచుతో నిండిన కొండలు ఉండే అద్భుతమైన ప్రదేశం మున్నార్. అందమైన ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు మిమ్మల్ని మైమరపింపజేస్తాయి.
వన్యప్రాణులు, ప్రకృతి ప్రేమికులకు వయనాడ్ స్వర్గధామం లాంటిది. ట్రెక్కింగ్ చేయడానికి ఇక్కడ జలపాతాలు, పచ్చని కొండలు ఎంతో బాగుంటాయి.
కేరళలో రెండవ ఎత్తైన శిఖరం అగస్త్యకూడం. వందల ఏళ్లనాటి వృక్షాలు, వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తాయి.
కొడైకెనాల్ చుట్టూ లోయలు, కొండలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఇది ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రదేశం.
ప్రశాంతమైన సరస్సులు, సుగంధ ద్రవ్యాల తోటలతో ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది ఏర్కాడ్ ప్రాంతం. ఇక్కడ చల్లని వాతావరణం అందరినీ ఆకర్షిస్తుంది.
కున్నూర్ అంతటా విస్తారమైన టీ తోటలు, అందమైన సరస్సులు పెద్ద కొండలు కనిపిస్తాయి. ఇక్కడ చల్లని, ప్రశాంతమైన వాతావరణం, సుగంధ మొక్కలు అందరికీ నచ్చుతాయి.