Travel
ప్రశాంతమైన ఆశ్రమాలు, పచ్చని లోయలు, గొప్ప సంస్కృతికి భూటాన్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వీసా లేకుండానే భారతీయులు వెళ్లి రావచ్చు. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.
బాలిలోని అందమైన బీచ్‌లు, ప్రాచీన దేవాలయాలు, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్ కలిగిన ఇండోనేషియాలో ఇండియన్స్ 30 రోజుల వరకు వీసా లేకుండా నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు.
బీచ్ లంటే ఇష్టపడేవారికి మారిషస్ స్వర్గధామం లాంటిది. పాస్‌పోర్ట్ ఉన్న ఇండియన్స్ ఎవరైనా 90 రోజుల వరకు వీసా లేకుండా ఇక్కడ తిరగొచ్చు.
హిమాలయ ప్రాంతాలు, గొప్ప సంస్కృతి కలిగిన నేపాల్, భారతీయులకు బాగా నచ్చుతుంది. ఇండియన్ గవర్నమెంట్ జారీ చేసిన ఏ ఐడీ కార్డ్ ఉన్నా ఇక్కడ నేచర్ ని చూడటానికి వెళ్లొచ్చు.
అందమైన బీచ్‌లు, నీలిరంగులో ఉండే నీటితో స్వర్గంలో ఉన్నామా అనిపించే ఫిజి దీవుల్లో భారతీయులు 120 రోజుల వరకు వీసా లేకుండా ఉండొచ్చు.