Telugu

ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి!

Telugu

ఉల్లిపాయ

ఉల్లిపాయ వాసనను ఎలుకలు తట్టుకోలేవు. ఉల్లిపాయను దంచి ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో పెడితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

సుగంధ తైలాలు

పుదీనా, లావెండర్, యూకలిప్టస్, సిట్రోనెల్లా వంటి సుగంధ తైలాలను ఉపయోగించి ఎలుకలను తరిమికొట్టవచ్చు. వాటిని నీటిలో కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

పిల్లిని పెంచుకోవచ్చు

పిల్లి ఉన్న చోటుకి ఎలుకలు రావు. ఇంట్లో పిల్లిని పెంచుకోవడం ద్వారా ఎలుకలు రాకుండా చూసుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

సుగంధ ద్రవ్యాలు

కొన్ని వాసనలు ఎలుకలకు అస్సలు పడవు. లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాల వంటివి ఎలుకలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

దారులు మూసేయాలి

ఎలుకలు బయటి నుంచి ఇంట్లోకి ప్రవేశించే రంధ్రాలు, పగుళ్లు, ఖాళీలను మూసివేయాలి.

Image credits: Getty
Telugu

వెనిగర్

వెనిగర్ ఆమ్ల వాసన ఎలుకలకు ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని దూదిలో ముంచి ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో పెడితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

మొక్కలు పెంచడం ద్వారా..

కొన్ని మొక్కలు ఎలుకలను తరిమికొట్టడంలో సహాయపడతాయి. ఇంట్లో బంతి మొక్కను పెంచడం ద్వారా ఎలుకలు రాకుండా చేసుకోవచ్చు.

Image credits: Getty

Tips and Tricks: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!

Skin Care: పుదీనాతో వీటిని కలిపి రాస్తే ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు!

Kitchen Tips: కిచెన్ శుభ్రంగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు..!

Gas Stove Cleaning Tips: వీటితో గ్యాస్ స్టవ్ ని ఈజీగా శుభ్రం చేయవచ్చు!