నిన్న, మొన్న చేసిన చపాతీలను ఎవరూ ఇష్టపడరు. అవి గట్టిగా ఉంటాయి. రుచి కూడా మారిపోతుంది. కానీ అవే రోటీలను తాజాగా, మెత్తగా మార్చవచ్చనే విషయం మీకు తెలుసా?
పాత రోటీలను ప్రెషర్ కుక్కర్‌లో వేడి చేసి మెత్తగా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్‌లోని వేడి ఆవిరి వల్ల రోటీలకు తేమ తిరిగి వస్తుంది.
ముందుగా పాత రోటీలను ఒక క్లాత్ లో ఉంచి, ఒక గిన్నెలో పెట్టాలి. గాలి చొరబడకుండా మూసేయాలి.
ప్రెషర్ కుక్కర్‌లో 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు రోటీలున్న గిన్నె కంటే ఎక్కువ ఉండకూడదు.
కుక్కర్ లోపల రోటీలు పెట్టిన గిన్నె ఉంచండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. కానీ విజిల్ పెట్టద్దు. మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి.
4-5 నిమిషాలు రోటీలను ఆవిరిలో ఉంచండి. తర్వాత గ్యాస్ ఆపేసి 2 నిమిషాల తర్వాత కుక్కర్ తెరవండి. మెత్తడి రోటీలు రెడీ.