పాడైన ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మానుకోండి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు, దుర్వాసనకు దారితీస్తుంది.
వెనిగర్‌ను నీటితో కలిపి ఫ్రిజ్ లోపలి భాగాన్ని తుడిస్తే దుర్వాసన పోతుంది.
దుర్వాసనను తొలగించడానికి కాఫీ పొడి కూడా వాడచ్చు. ఇందులో నైట్రోజన్ ఉండటం వల్ల దుర్వాసనను పీల్చుకుంటుంది. ఒక గిన్నెలో కాఫీ పొడిని తీసుకుని ఫ్రిజ్‌లో ఉంచండి.
క్రమం తప్పకుండా ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం ముఖ్యం. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఫ్రిజ్‌ను శుభ్రం చేస్తే.. దుర్వాసన రాకుండా నిరోధించవచ్చు.
AC లాగే ఫ్రిజ్‌కి కూడా ఫిల్టర్ ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా మార్చాలి. లేకపోతే గాలి నిలిచిపోయి దుర్వాసన వస్తుంది.
నిమ్మరసంతో కూడా ఫ్రిజ్‌లోని దుర్వాసనను తొలగించవచ్చు. ఫ్రిజ్ లోపలి భాగాలను నిమ్మరసంతో తుడిస్తే సరిపోతుంది.
ఒక గిన్నెలో బేకింగ్ సోడాను ఉంచితే ఫ్రిజ్‌లోని దుర్వాసనను తొలగించవచ్చు.