Tips

టవర్లు లేకున్నా..

ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకొస్తున్నారు. జనవరి 27 నుండి వారి డైరెక్ట్ టు సెల్ సాటిలైట్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇంతకీ ఈ సేవలు ఎలా ఉపయోగపడనున్నాయంటే. 

Image credits: iSTOCK

శాటిలైట్ నుంచి నేరుగా మొబైల్ కనెక్షన్

ఈ సేవలకు ప్రత్యేకంగా టవర్స్ అవసరం లేదు. మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌లోని శాటిలైట్ ఇంటర్నెట్ విభాగం స్టార్‌లింక్ 'డైరెక్ట్-టు-సెల్ శాటిలైట్' ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 

మొబైల్ వాడుకదారులకు శాటిలైట్ ఇంటర్నెట్

ఈ టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ వాడుకదారులకు నేరుగా ఉపగ్రహం నుంచి ఇంటర్నెట్ సేవలను పొందుతారు. 

టవర్లు లేని చోట్ల కూడా నెట్‌వర్క్

ఈ సరికొత్త టెక్నాలజీ సహాయంతో మొబైల్ టవర్స్ లేని అత్యంత మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా పొందొచ్చు. 

డైరెక్ట్ టు సెల్ శాటిలైట్ ప్రాజెక్ట్

ఎలాన్ మస్క్ ఈ ప్రాజెక్టును డైరెక్ట్ టు సెల్ శాటిలైట్ పేరుతో తీసుకొచ్చారు. ఇందులో భాగంగా శాటిలైట్‌లు నేరుగా స్మార్ట్‌ఫోన్‌లు ఇతర మొబైల్ పరికరాలకు కనెక్ట్ అవుతాయి. 

పర్వతాల నుంచి ఎడారుల వరకు

ఈ టెక్నాలజీతో పర్వతాలు, ఎడారులు, సముద్ర ప్రాంతాలు ఇలా.. ఇప్పటి వరకు ఇంటర్నెట్, మొబైల్ టవర్ సౌకర్యాలు లేని ప్రదేశంలో కూడా టెలికం సేవలు లభించనున్నాయి. 

ప్రకృతి వైపరీత్యాలు నెట్‌వర్క్‌కు అడ్డు కావు

ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ టవర్లు దెబ్బతింటే అంతరాయం ఏర్పడుతుంటాయి. అయితే ఈ శాటిలైట్ నెట్‌వర్క్ కమ్యూనికేషన్ లో ఇలాంటి సమస్యే ఉత్పన్నం కాదు. 

ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ విప్లవం

దీంతో ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ విప్లవం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొబైల్ నెట్‌వర్క్ అందని ప్రదేశాలు ఇప్పుడు ఈ టెక్నాలజీతో కవర్ కానున్నాయి. 

Image credits: iSTOCK

ఒకే వాట్సాప్‌లో రెండు ఖాతాలు ఎలా వాడాలో తెలుసా.? వెరీ సింపుల్‌...

ఐఫోన్ 17 To శాంసంగ్ గెలాక్సీ S25.. 2025లో వచ్చే సూపర్ ఫోన్లు