వంటగదిలో పాత్రలు ఉంచే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. ప్రతిసారీ వాడిన తర్వాత పాత్రలను బాగా కడిగి శుభ్రం చేయాలి. పాత్రలను ఆరబెట్టడం మర్చిపోవద్దు.
వంటగదిలో ఆహార పదార్థాల భద్రత కూడా ముఖ్యం. వాడే ముందు కూరగాయలను శుభ్రంగా కడగాలి.
వంటగదిలో కౌంటర్ టాప్స్ పై కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు పెట్టడం వల్ల క్రిములు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
వంటగదిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా క్రిములు దాగి ఉండవచ్చు. కాబట్టి వాటిని కూడా రెగ్యులర్ గా శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి దాంతో ఎలక్ట్రానిక్ వస్తువులను తుడిస్తే.. క్రిములు నశిస్తాయి.
నిమ్మరసంలో ఉప్పు కలిపి వంటగది కౌంటర్ టాప్స్ ను రెగ్యులర్ గా శుభ్రం చేస్తే.. క్రిములు నశిస్తాయి.
Gas Stove Cleaning Tips: వీటితో గ్యాస్ స్టవ్ ని ఈజీగా శుభ్రం చేయవచ్చు!
Bed Bugs Control Tips: ఇలా చేస్తే మంచాలు, సోఫాల్లో ఒక్క నల్లి ఉండదు!
Sink Cleaning Tips: కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే ఇవి చేస్తే చాలు!
Lizards: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు!