

విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన కమలాపండు చర్మానికి తేమను అందిస్తుంది. ముడతలు రాకుండా చేస్తుంది.

విటమిన్లు A, B, C, యాంటీఆక్సిడెంట్లు కలిగిన బొప్పాయి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

95% వరకు నీరు కలిగిన పుచ్చకాయ కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన మామిడి పండ్లు తినడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆపిల్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటివి జామకాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతలను నివారించి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది.