Chat GPT: చాట్ జీపీటీలో ఇవి మాత్రం అస్సలు సెర్చ్ చేయకండి..!
technology Jul 19 2025
Author: Rajesh K Image Credits:freepik
Telugu
చట్టవిరుద్ధ, అనైతిక విషయాలు
ChatGPT లేదా AI ని చట్టవిరుద్ధ లేదా అనైతిక విషయాల కోసం ఉపయోగించకూడదు. హ్యాకింగ్, నకిలీ పత్రాలు, మాదకద్రవ్యాలు, బాంబుల తయారీ వంటి అంశాలు వెతకడం నిషిద్ధం.
Image credits: freepik
Telugu
తీవ్ర భావోద్వేగ సమస్యలు
తీవ్ర ఒత్తిడి, నిరాశ లేదా ఆత్మహత్య వంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో ChatGPT వెతకకూడదు. అలాంటి సందర్భాల్లో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం అత్యవసరం.
Image credits: pexels
Telugu
వ్యక్తిగత సమాచారం
ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని ChatGPTలో షేర్ చేయకండి. AI ఈ సమాచారాన్ని భద్రంగా ఉంచినా, మీ వ్యక్తిగత గోప్యతను కాపాడడం మీ బాధ్యత కూడా
Image credits: freepik
Telugu
తప్పుడు సమాచారం
ChatGPT కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇవ్వవచ్చు. ముఖ్యమైన విషయాల విషయంలో మీరే పరిశీలించి నిర్ధారించుకోవాలి. దీన్ని తప్పుడు ప్రచారం, రాజకీయ అసత్యాలకు వాడకండి. సమాజ హితంగా ఉండండి.
Image credits: pexels
Telugu
ముగింపు
ChatGPT జ్ఞానం, రచన, సృజనాత్మకతకు మంచి సాధనం. కానీ బాధ్యతాయుతంగా వాడాలి.