మొబైల్లో డిలీటైన ఫోటోలు రికవర్ చేసుకునే సింపుల్ ట్రిక్స్
technology Nov 09 2026
Author: Arun Kumar P Image Credits:Freepik
Telugu
ఇలా చేసి చూడండి
చాలా ఫోన్ గ్యాలరీ యాప్స్‌లో Recently Deleted లేదా Trash ఫోల్డర్ ఉంటుంది. మీరు అప్పుడే డిలీట్ చేసిన ఫోటోలు లేదా వీడియోలు 30 రోజుల వరకు అక్కడే స్టోర్ అయి ఉంటాయి.
Image credits: Getty
Telugu
ఇక్కడ 60 రోజుల వరకు ఫోటోలు ఉంటాయి
గూగుల్ ఫోటోస్ యాప్‌లో Trash ఫోల్డర్‌కు వెళ్తే, అక్కడ 60 రోజుల వరకు మీరు డిలీట్ చేసిన ఫోటోలు భద్రంగా ఉంటాయి. మీరు వాటిని రికవర్ చేయవచ్చు.
Image credits: Freepik
Telugu
ఈ విధంగా కూడా ఫోటోలు తిరిగి పొందవచ్చు
గూగుల్ ఫోటోస్‌లో Library > Trash కి వెళ్లి, మీకు కావాల్సిన ఫోటోని ఎంచుకుని రీస్టోర్ చేసుకోవచ్చు.
Image credits: Freepik
Telugu
ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఒకవేళ మీ ఫోటో 'Recently Deleted' లేదా 'Trash' ఫోల్డర్‌లో దొరకకపోతే, మీరు Google Play Store కి వెళ్లి 'DiskDigger' లాంటి రికవరీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Image credits: Getty
Telugu
నిమిషాల్లో డిలీట్ అయిన ఫైల్స్ దొరుకుతాయి
ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఫోన్ స్టోరేజ్‌ని స్కాన్ చేయవచ్చు. ఆ విధంగా డిలీట్ అయిన ఫోటోలను వెతికి రికవర్ చేయవచ్చు.
Image credits: Getty
Telugu
ఇది ఫ్రీ యాప్
కొన్ని యాప్స్ పెయిడ్ (డబ్బు చెల్లించాలి) అయి ఉంటాయి. కానీ DiskDigger ఫ్రీగా అద్భుతంగా రికవరీ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ పొందవచ్చు.
Image credits: iSTOCK
Telugu
అన్ని ఫోటోలూ తిరిగి వస్తాయా?
మీరు ఫోటో డిలీట్ చేసిన తర్వాత ఎంత త్వరగా రికవరీ చేస్తారు, అలాగే ఎన్ని కొత్త ఫైల్స్ సేవ్ చేశారు అన్నదానిపై ఫోటో రికవరీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.