Spiritual
వాస్తు ప్రకారం ఇంటికి ప్లానింగ్ ఎంత ముఖ్యమో, పైకప్పు ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతి వస్తువు పైకప్పుపై వేసేయకూడదు.
వెదురు లేదా వెదురు వస్తువులను పైకప్పుపై ఉంచవద్దని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. అలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండదట.
పైకప్పుపై చీపుళ్ళు ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట.
పైకప్పుపై తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఉంచడం మంచిది కాదు. అవి నెగెటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి.
పైకప్పుపై ముళ్ళ మొక్కలు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. వాటిని ఇంట్లో లేదా తోటలో ఉంచండి.