హిందూ శాస్త్రాల ప్రకారం కొన్ని చెట్లు, మొక్కలు పవిత్రమైనవి. తులసి, శమీ, అరటి వంటి మొక్కలను ఇంట్లో పెంచుకుంటే సంతోషంతో పాటు ఆరోగ్యం లభిస్తాయి.
కానీ, కొన్ని మొక్కలు అశుభమైనవని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు దూరమవుతాయట. అవేంటంటే..
ప్రత్తి మొక్క చూడటానికి అందంగా ఉన్నా, దాన్ని ఇంట్లో పెంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రత్తి మొక్క శుభప్రదం కాదు. దీన్ని ఇంట్లో పెంచితే నెగెటివ్ ఎనర్జీని ఇస్తుంది.
చింతపండు రుచి బాగున్నా, చింతచెట్టు మాత్రం జీవితంలో సమస్యలు తెస్తుంది. చింతచెట్టు ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తుంది. దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు దూరమవుతాయి.
బాబుల్ చెట్టు కూడా వాస్తు ప్రకారం శుభప్రదం కాదు. దీన్ని ఇంట్లో లేదా ఇంటి చుట్టూ పెంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బాబుల్ చెట్టు కలహాలకు కారణమవుతుందట.