కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?
spiritual May 07 2026
Author: Arun Kumar P Image Credits:Gemini AI
Telugu
ఎవరీ కుంభకర్ణుడు?
రామాయణంలో కుంభకర్ణుడు అనగానే మనకు గుర్తొచ్చేది అతని సుదీర్ఘ నిద్ర, అంతులేని ఆకలి. కానీ అతని నిద్ర వెనుక ఓ పెద్ద రహస్యమే దాగి ఉంది!
Image credits: Gemini
Telugu
రావణ సోదరుల ఘోర తపస్సు
రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు.. ఈ ముగ్గురు సోదరులు బ్రహ్మ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
Image credits: Gemini AI
Telugu
దేవతల్లో వణుకు
కుంభకర్ణుడి శక్తిని చూసి దేవతలు భయపడిపోయారు. అతను 'ఇంద్రాసనం' (ఇంద్రుడి సింహాసనం) అడిగితే స్వర్గలోకం అతని వశమవుతుందని ఇంద్రుడికి భయం పట్టుకుంది.
Image credits: Gemini AI
Telugu
సరస్వతి దేవి ఎంట్రీ
ఇంద్రుడి కోరిక మేరకు చదువుల తల్లి సరస్వతీ దేవి, అదృశ్య రూపంలో కుంభకర్ణుడి నాలుకపై కూర్చుంది. అతను వరం అడిగే సమయంలో మాట తడబడేలా చేసింది.
Image credits: Gemini AI
Telugu
ఇంద్రాసనం బదులు నిద్రాసనం!
కుంభకర్ణుడు 'ఇంద్రాసనం' అని అడగడానికి నోరు తెరవగా, సరస్వతీ దేవి ప్రభావంతో అతని నోటి నుంచి 'నిద్రాసనం' (నిద్ర) అనే పదం వచ్చింది. బ్రహ్మ వెంటనే 'తథాస్తు' అనేశాడు!
Image credits: Gemini AI
Telugu
రావణుడి ఆవేదన
తమ్ముడికి జరిగిన అన్యాయం చూసి రావణుడు ఆ వరాన్ని వెనక్కి తీసుకోమని బ్రహ్మను వేడుకున్నాడు. కానీ ఒకసారి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాలేదు.
Image credits: Gemini AI
Telugu
6 నెలల నిద్ర, 1 రోజు మెలకువ..!
అప్పుడు బ్రహ్మ దేవుడు వరం ప్రభావాన్ని తగ్గించి, 'కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు, కేవలం ఒక్క రోజు మాత్రమే మెలకువగా ఉంటాడు' అని వరాన్ని సవరించాడు.
Image credits: Gemini AI
Telugu
సృష్టికి రక్షణ..
ఒకవేళ కుంభకర్ణుడు ప్రతిరోజూ మెలకువగా ఉంటే, అతని విపరీతమైన ఆకలికి సృష్టిలోని జీవరాశులన్నీ బలి అయ్యేవి. తెలియక జరిగిన ఈ పొరపాటు వరం, లోకానికి మంచే చేసింది.