వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో ఉంచే కొన్ని వస్తువులు లవ్ లైఫ్‌పై నెగిటివ్ ప్రభావం చూపుతాయి. ఆ వస్తువులు ఏంటో ఇక్కడ చూద్దాం.
భార్యాభర్తలు పడుకునే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. ఇది పెద్ద వాస్తు దోషానికి కారణం కావచ్చు. ఈ దోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.
బెడ్‌రూమ్‌లో మంచం కింద పొరపాటున కూడా చీపురు పెట్టకూడదు. దీనివల్ల లవ్ లైఫ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉంది.
వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ పూజగదిని ఏర్పాటు చేయకూడదు. బెడ్‌రూమ్‌లో పూజగది ఉంటే వారి జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి.
బెడ్‌రూమ్‌లో దేవుడి పుస్తకాలు కూడా పెట్టకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దానివల్ల జీవితంలో నెగెటివిటీ పెరిగే అవకాశం ఉంది.
బెడ్‌రూమ్‌లో ఆగిపోయిన గడియారాలు, పనికిరాని సామాన్లు ఉంచకూడదు. ఇలాంటివి నెగెటివిటీని వ్యాపింపజేస్తాయి.
Ugadi 2026: పరాభవనామ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభమో తెలుసా?
ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?
శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?
పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?