Premanand Maharaj: రాత్రి పడుకునే ముందు ఈ 3 పనులు అస్సలు చేయకండి
చేయకూడని పనులు
ప్రేమానంద్ మహారాజ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో రాత్రి పడుకునే ముందు చాలా మంది చేస్తున్న తప్పుల గురించి, వాటిని ఎలా మానుకోవాలో ఆయన వివరించారు.
కుట్రలు, కుయుక్తులు ఆలోచించకండి
రాత్రి పడుకునే ముందు ఇతరులపై కుట్రలు, కుయుక్తులు పన్నుతూ ఉంటారు. అలా చేసేవారి జీవితంలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. దాన్ని మానుకోవాలి.
లగ్జరీస్ గురించి ఆలోచించకండి
రాత్రి పడుకునే ముందు రకరకాల లగ్జరీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ భోగాలు వారిని చెడు మార్గాల్లోకి నడిపిస్తాయని వాళ్ళు గ్రహించరు.
మొబైల్ ఫోన్ వాడకండి
పడుకునే ముందు మొబైల్‌కి అతుక్కుపోయి అందులోనే మునిగిపోతారు. మొబైల్ చూసే బదులు ఆ సమయాన్ని కుటుంబం, పిల్లలు, పెద్దవారితో గడపాలి.
దీన్ని కూడా గుర్తుంచుకోండి
నిద్ర ఓ రకంగా మరణంతో సమానం. అందుకే పడుకునే ముందు మంత్ర జపం, భగవంతుణ్ణి తలచుకోవాలి. అప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది.