Telugu

Premanand Maharaj: ఈ 5 విషయాల్ని ఎప్పుడూ మార్చకూడదు

Telugu

అలా చేస్తే దోషం

జీవితంలో ఐదు విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోకూడదని ప్రేమానంద్ మహారాజ్ తన ప్రవచనంలో చెప్పారు. అలా చేస్తే దోషం అంటుకుంటుందట. అవేంటంటే.. 

Telugu

గురువుని ఒక్కసారే ఎంచుకోవాలి

గురువును ఒక్కసారి బాగా ఆలోచించి ఎన్నుకోవాలి. ఒకరిని గురువుగా స్వీకరించాక వదిలివేయకూడదు. అలా చేస్తే మహా పాపం.

Telugu

మంత్రాన్ని వీడకండి

మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వారు మీకు ఏదైనా మంత్రం ఇస్తే దాన్నే జీవితాంతం జపించాలి. మన ఇష్ట ప్రకారం లేదా మరొకరి మాట విని మంత్రం మార్చకూడదు.

Telugu

గురువు ఇచ్చిన గ్రంథం

గురువు మీకు ఏదైనా ధార్మిక గ్రంథం ఇస్తే దాన్ని జీవితాంతం మీతో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని స్థానంలో అదే గ్రంథాన్ని కొత్తగా తీసుకురాకూడదు. 

Telugu

ఇష్టదైవాన్ని మార్చకండి

మీరు ఎవరినైతే ఇష్టదైవంగా భావిస్తారో జీవితాంతం వారికే పూజ చేయండి. వారి స్థానంలో వేరే దేవుడిని ఇష్టదైవంగా చేసుకోకండి.

 

Telugu

జపమాలను మార్చకండి

మీరు ప్రతిరోజూ మంత్ర జపం చేసే మాల విరిగిపోతే దాన్నే బాగుచేయించుకుని మళ్ళీ వాడండి. మంత్ర జపానికి వాడే మాలను తరచుగా మార్చకూడదు.

అతిగా మాట్లాడితే ఎన్ని సమస్యలో తెలుసా?

చాణిక్యుడి చిట్కాలు పాటిస్తే కెరీర్‌లో గ్రోత్ కన్ఫర్మ్

మీ కష్టాలన్నీ పోవాలంటే మౌని అమావాస్య రోజు ఇలా చేయండి

చాణక్య నీతి: చావే బెటర్ అని ఎప్పుడనిపిస్తుందంటే..