Spiritual
మహాశివరాత్రి ఫిబ్రవరి 26, బుధవారం నాడు వస్తుంది. ఈ రోజు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. పూజలో ఈ తప్పులు జరగకుండా చూసుకోండి.
పూజలో పొరపాటున కూడా శివుడికి కేతకి పువ్వులు పెట్టకండి. శివుడే స్వయంగా తన పూజలో కేతకి పువ్వులను నిషేధించాడని పురాణాల్లో చెబుతారు.
శివుడి పూజలో పసుపు కుంకుమ కూడా పెట్టకూడదట. ఇవి స్త్రీలు అలంకరించుకునే వస్తువులు కాబట్టి ఉపయోగించకూడదంటారు.
శివరాత్రి రోజు శివలింగానికి శంఖంతో అభిషేకం చేయడం నిషేధం. ఎందుకంటే అది రాక్షసుడు శంఖ్‌చుడ్ నుండి పుట్టింది. శివుడు తన త్రిశూలంతో అతన్ని చంపాడు. అందుకే అది అశుభం.
చాలా చోట్ల శివుడి పూజలో తులసిని పెట్టరు. ఎందుకంటే పురాణాల ప్రకారం తులసి విష్ణువు భార్య. అందుకే ఆమెను విష్ణువు పూజకు మాత్రమే ఉపయోగిస్తారు.
శివరాత్రి రోజు ఆలయంలో చండీ ప్రదక్షిణ చేయడం మంచిది. అంటే స్వామి వారి అభిషేక జలం వచ్చే మార్గం నుంచి వెనక్కు, ముందుకు తిరగాలి.
కొందరు శుచి, శుభ్రత పాటించరు. మరికొందరికి మైలు గురించి తెలియదు. అందుకే సాధారణ ప్రజలు శివలింగాన్ని తాకి పూజ చేయకూడదని పండితులు చెబుతున్నారు.