Spiritual
చాణక్యుడి సూత్రాల ప్రకారం జీవితంలో స్నేహితులు ఎంత అవసరమో, శత్రువులు కూడా అంతే అవసరం. వారు మనకు పోరాడి విజయం సాధించడం నేర్పిస్తారు.
ప్రతి ఒక్కరూ నేరుగా దాడి చేయరు. కొంతమంది స్నేహితులుగా మనతోనే ఉంటారు. కానీ రహస్యంగా మనం ఓడిపోవాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తులెవరో కనిపెట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి.
విజయం అంటే శారీరక బలంతో కొట్టి కింద పడేయడం కాదు. తెలివితేటలతో ఓడిపోయేలా చేయాలి. శత్రువు బలహీనతను గుర్తించగలిగితే వారిని ఓడించడం సులభం అవుతుంది.
రహస్యంగా దాగున్న శత్రువులతో వాదనలకు దిగడం హానికరం. చెడు మాటలు మాట్లాడటం లేదా ఆలోచించకుండా నిందించడం వల్ల సంఘర్షణ మరింత పెరుగుతుంది.
సాధారణంగా కత్తి కంటే మాటలకే ఎక్కువ పదును, శక్తి ఉంటుంది. మన అభిప్రాయాలను సరిగ్గా చెప్పగలిగితే ప్రత్యర్థి బలహీనపడతాడు. దీంతో అతని చెడు ఆలోచనైనా మారాలి. లేదా ఓడిపోయానని భావించాలి.
మీ స్నేహితుడిగా ఉన్న ఆ శత్రువు ఏమి ప్లాన్ చేస్తున్నారో కనిపెట్ట గలిగితే రానున్న ప్రమాదాన్ని నివారించవచ్చు.
మీ వ్యూహాలు, రహస్యాలను నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోండి. మన తదుపరి చర్య గురించి ప్రత్యర్థులకు చిన్న సూచన కూడా అందకూడదు.
మీ బలాన్ని మీ పనితో నిరూపించండి. మాటలతో కాదు. ఇదే విజయానికి నిజమైన అర్థం. దీంతో మీ రహస్య శత్రువు మీరే గ్రేట్ అని కచ్చితంగా రియలైజ్ అవుతాడు.
మీతోనే ఉంటూ మిమ్మల్ని బాధిస్తున్న శత్రువు చర్యలకు బాధపడుతూ కూర్చోకండి. ప్రతి కష్టమైన పరిస్థితిని తెలివితేటలతో ఒక అవకాశంగా మార్చుకోండి.