Spiritual
భారతదేశంలో పశ్చిమ రాష్ట్రాల్లో ఉండే శివ భక్తులకు ప్రధాన యాత్రా స్థలం ఉజ్జయిని.
ఇండియా మొత్తం మీద 2025లో మహాశివరాత్రి పండగను ఫిబ్రవరి 26న నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 17 నుండి 10 రోజులు నిర్వహిస్తారు. మహాశివరాత్రి అయిన మరునాడుతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉజ్జయిని క్షేత్రంలో మహాకాలేశ్వరుడు లింగ రూపంలోనే ఉంటారు. కాని ఎప్పుడూ మహాకాలుడి ముఖాన్ని అలంకరిస్తారు. ఆ మూర్తి చాలా గొప్పగా ఉంటుంది.
ఉజ్జయిని మహా కాలేశ్వరుడిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి రోజు లక్షల్లో భక్తులు వచ్చి దర్శిస్తారు.
సాధారణంగా ఎక్కడైనా శివుడు అలంకార ప్రియుడు కాదు. కాని ఇక్కడ ఉన్న లింగ రూపాన్ని మాత్రం మనిషి ముఖంలా వివిధ రంగుల్లో అలంకరిస్తారు.
శివరాత్రికి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నారు.