Spiritual
మహాశివరాత్రి నాడు దేశంలోని 12 జ్యోతిర్లింగ ఆలయాల్లో భక్తులు పోటెత్తుతారు. మరి ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
12 జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉంది. దీన్ని స్వయంగా చంద్రదేవుడు ప్రతిష్టించాడని నమ్ముతారు.
ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని రోజూ ఉదయం దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ఉంది. శివుడు స్వయంగా కాశీలో నివసిస్తున్నాడని నమ్ముతారు. ప్రళయంలో కూడా ఈ ప్రదేశం నాశనం కాదట.
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఈ జ్యోతిర్లింగం ఉంది. కైలాస పర్వతానికి ఉన్న ప్రాముఖ్యతను మహాదేవుడు కేదార్ ప్రాంతానికి కూడా ఇచ్చాడు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఇది ఏకైక దక్షిణ ముఖ జ్యోతిర్లింగం. ఇక్కడ జరిగే భస్మారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని శ్రీశైల పర్వతంపై ఈ జ్యోతిర్లింగం ఉంది. ప్రతి అమావాస్య నాడు శివుడు, పార్వతి ఇక్కడికి వస్తారని నమ్ముతారు.
గుజరాత్‌లోని ద్వారకలో ఈ జ్యోతిర్లింగం ఉంది. నాగుల దేవుడు కాబట్టి ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వర్ అని పేరు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని నమ్ముతారు.
మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఆలయం సమీపంలో నర్మదా నది ప్రవహిస్తుంది. ఈ జ్యోతిర్లింగం ఓం ఆకారంలో ఉంది.
తమిళనాడులోని రామనాథపురంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. దీన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడని నమ్ముతారు.
గోదావరి నది ఒడ్డున మహారాష్ట్రలోని త్రయంబక్‌లో ఈ జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడికి ప్రజలు కాళసర్ప, పితృ శాంతి పూజలు చేయడానికి వస్తారు.
ఇది జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో ఉంది. దీన్ని రాక్షసుల రాజు రావణాసురుడు ప్రతిష్టించాడని నమ్ముతారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయంటారు.
ఇది 12 జ్యోతిర్లింగాలలో చివరిది. మహారాష్ట్రలోని దౌలతాబాద్‌లో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందట.