Spiritual
ఆనందంగా జీవించడానికి సంబంధించిన ఎన్నో సూత్రాలు చాణక్య నీతిలో ఉన్నాయి. అయిదు రకాల వ్యక్తులకు మాత్రం సాయం చేయొద్దని చెప్పారు. వారెవరంటే..
అత్యాశ కలిగిన వ్యక్తులకు ఎప్పుడూ సాయం చేయకూడదు. మనం చేసిన సాయంతో వారు ఇతరులకు హాని కలిగించవచ్చు. వారికి దూరంగా ఉండాలి.
బద్ధకస్థులకు కూడా సాయం చేయకూడదు. అలా చేస్తే వారు మరింత సోమరిగా మారతారు. సాయం దొరకకపోతే వారే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అదే వారికి మంచిది.
చెడు ప్రవర్తన ఉన్నవారికి దూరంగా ఉండాలి. వారికి ఎలాంటి సాయం చేయకూడదు. అలా చేస్తే అందరూ మన ప్రవర్తనను కూడా అనుమానిస్తారు.
తాగుబోతులకు ఎలాంటి సాయం చేయకూడదు. వారు తాగడం కోసం ఏదైనా చేస్తారు. మనల్ని కూడా అందుకే సాయం అడుగుతారు.
ఎప్పుడూ తమ గురించే ఆలోచించే స్వార్థపరులకు సాయం చేయకూడదు. వారు తమ కోసమే బతుకుతారు. ఇతరులను కూడా వాడుకుంటారు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి.