Spiritual
మహాభారత యుద్ధంలో పాండవుల మామ ఒకరు కౌరవుల పక్షాన పోరాడారు. తరువాత ధర్మరాజు చేతిలో మరణించారు. ఆ పాండవుల మామ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
మహాభారతం ప్రకారం మద్ర దేశపు రాజు శల్యుడు. ఆయన తన చెల్లెలు మాద్రిని పాండురాజుకిచ్చి వివాహం చేశాడు. పాండురాజుకి కుంతీ అనే మరో భార్య కూడా ఉంది.
కుంతీకి పాండురాజుకి ముగ్గురు కుమారులు పుట్టారు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. మాద్రికి ఇద్దరు కవలలు పుట్టారు. వారే నకుల, సహదేవులు. ఈ విధంగా శల్యుడు పాండవుల మామ అయ్యాడు.
కురుక్షేత్రంలో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతుందని శల్యునికి తెలియగానే, ఆయన తన సైన్యంతో కలిసి పాండవులకు మద్దతు ఇవ్వడానికి బయలుదేరాడు.
దారిలో దుర్యోధనుడు కుట్రపన్ని శల్యునికి మెప్పించి, పాండవులకు వ్యతిరేకంగా పోరాడేలా ఒప్పించాడు. శల్యుడు ఇచ్చిన మాట ప్రకారం కౌరవులకు మద్దతు ఇవ్వవలసి వచ్చింది.
కర్ణుడి మరణం తర్వాత దుర్యోధనుడు శల్యునిని కౌరవ సైన్యాధిపతిగా నియమించాడు. శల్యుడు, ధర్మరాజు మధ్య భీకర యుద్ధం జరిగింది. ధర్మరాజు చేతిలో శల్యుడు మరణించాడు.