Spiritual

పూజ గదిలో ఎరుపు రంగు వాడకూడదా?

పూజ గదిలో ఏ రంగు వాడకూడదు

వాస్తు నిపుణుల ప్రకారం పూజ గదిలో ఎరుపు రంగు వాడకూడదు. ఎరుపు రంగు అగ్నికి ప్రతీక. మీరు పూజ లేదా ధ్యానం చేసేటప్పుడు ఆ రంగు ఉంటే ప్రశాంతత ఉండదు.

 

గ్రహాల, శక్తుల ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎర్ర రంగు మంగళ గ్రహానికి సంబంధించినది, ఇది ఉగ్రత, సంఘర్షణకు చిహ్నం. పూజలో ప్రశాంతత అవసరం, దాన్ని ఎరుపు రంగు భగ్నం చేస్తుంది.

శివ పూజలో నిషిద్ధం

శివ పూజలో ఎర్ర రంగు నిషిద్ధం. శివుడు ప్రశాంతతకు దేవుడు. ఎర్ర రంగు శివుడి ప్రశాంత స్వరూపానికి విరుద్ధం. శివ పూజలో తెలుపు శుభప్రదం.

అశాంతికి కారణం

ఎర్ర రంగు పూజలో ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తుంది.

శాస్త్రీయ దృక్పథం

ఎరుపు రంగు కళ్ళు, మెదడు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది, దాంతో ఒత్తిడి పెరుగుతుంది. పూజలో మానసిక, శారీరక ప్రశాంతత అవసరం, దాన్ని ఎరుపు రంగు భగ్నం చేస్తుంది.

పూజ గదికి ఏ రంగు శుభం?

పూజ గదిని ఎల్లప్పుడూ తెలుపు, నీలం లేదా పసుపు రంగు వేయండి. అలాగే, ఆసనం, పవిత్ర గ్రంథాల కవర్లు, దేవుడి ఆసనం, బల్బు వంటి వాటికి కూడా ఇవే రంగులు వాడండి.

చాణక్య నీతి : ఈ ఐదుగురిని మాత్రం నిద్రలేపకూడదు

మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు: కరెక్ట్ నంబర్ ఇదిగో

లక్ష్మీదేవి కటాక్షం అందించే సువాసనలు ఇవి

ఘటోత్కచుడు చనిపోతే కృష్ణుడు సంతోషించాడా? కారణం ఇదే