Spiritual
చాణక్య నీతి ప్రకారం ఐదుగురిని అస్సలు నిద్రలేపకూడదట. వాళ్లను నిద్రలేపితే మనమే ఇబ్బంది పడతామట. మరి వారెవరో ఓసారి చూద్దాం..
మూర్ఖుడు నిద్రపోతుంటే లేపకూడదని చాణక్య చెప్పారు. లేకపోతే అనవసరపు మాటలతో మన సమయాన్ని వృధా చేసి, ఇబ్బందుల్లోకి నెడతారు.
నిద్రపోతున్న పాముని లేపకూడదు. పాముని లేపితే ప్రాణాపాయం సంభవిస్తుంది. కాబట్టి దూరం నుండి వెళ్ళిపోవాలి.
యజమాని నిద్రపోతుంటే అనవసరంగా లేపకూడదు. అది వారికి కోపం తెప్పించి, మనతో దురుసుగా ప్రవర్తించేలా చేస్తుంది.
చిన్న పిల్లలు నిద్రపోతుంటే లేపకూడదు. లేచి, చాలా ఇబ్బంది పెడతారు. వారిని సంభాళించడం కష్టం.
కుక్క లేదా ఇతర హింసాత్మక జంతువు నిద్రపోతుంటే లేపకూడదు. హింసాత్మక జంతువులు ఎవరిపైనా దాడి చేయవచ్చు. వాటిని సంభాళించడం కష్టం.
మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు: కరెక్ట్ నంబర్ ఇదిగో
లక్ష్మీదేవి కటాక్షం అందించే సువాసనలు ఇవి
ఘటోత్కచుడు చనిపోతే కృష్ణుడు సంతోషించాడా? కారణం ఇదే
సుఖమైన దాంపత్యం కోసం 5 మంత్రాలు