Spiritual
శని గ్రహం నుంచి శుభ ఫలితాల కోసం జ్యోతిషులు చెప్పులు దానం చేయమని సలహా ఇస్తారు. ఇలా చేస్తే శని దేవుడు సంతోషిస్తాడని, సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
అవసరంలో ఉన్నవారికి చెప్పులు దానం చేస్తే శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. అయితే దానం చేసే చెప్పుల రంగు విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని అంటున్నారు.
ఉజ్జయిని జ్యోతిషాచార్య పండిట్ ప్రవీణ్ ద్వివేది ప్రకారం, ఏ రంగు చెప్పులైనా దానం చేయవచ్చు. కానీ నల్ల చెప్పులు దానం చేస్తేనే ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతాయి.
జ్యోతిష్య నిపుణులు ప్రకారం.. శని దేవుడి రంగు నలుపు, కాబట్టి నలుపు రంగుకు సంబంధించిన ప్రతిదానిపై ఆయన ప్రభావం ఉంటుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల చెప్పులు దానం చేయాలి.
ఎవరికైనా చెప్పులు దానం చేయవచ్చు, కానీ కుష్టు రోగులకు నల్ల చెప్పులు దానం చేస్తే శని దేవుడు త్వరగా ప్రసన్నుడై అనుగ్రహం చూపుతాడని పండితులు చెబుతున్నారు.