Spiritual

ఇంట్లో పూజించే గణపతి విగ్రహానికి తొండం ఎటువైపు ఉండాలో తెలుసా

గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7న

సెప్టెంబర్ 7, శనివారం వినాయక చవితి. ఈ రోజు ఇళ్లలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తాం కదా. మీరు కచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం…

గణేష్ విగ్రహానికి తొండం ఏ దిక్కున ఉండాలి

గణేష్ విగ్రహాన్ని తీసుకునేటప్పుడు దాని తొండం ఎడమ వైపునకు వంగి ఉండేలా చూసుకోవాలి. అలాంటి విగ్రహం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీనిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయి.

నిలుచున్న గణేష్ విగ్రహాన్ని తీసుకోకండి

వినాయకుడు నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకండి. ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న గణేష్ విగ్రహం శుభప్రదంగా భావిస్తారు.

 

ఏ రంగు విగ్రహం శుభప్రదం?

వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు రంగులను కూడా గుర్తుంచుకోవాలి. నలుపు లేదా చాలా ముదురు రంగు విగ్రహాన్ని తీసుకోకండి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి శుభప్రదమైన రంగుల విగ్రహాలు మంచివి. 

మట్టి విగ్రహాన్ని మాత్రమే తీసుకోండి

ధర్మ గ్రంథాల ప్రకారం మట్టితో చేసిన దేవతా విగ్రహం ఉత్తమం. మట్టి పంచభూతాలలో ఒకటి కాబట్టి చాలా పవిత్రమైనది. కాబట్టి మట్టి గణేష్ విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్టించండి.

ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

శాస్త్రాలలో విఘ్నేశ్వరుడి రూపం గురించి వర్ణించారు. అదేంటంటే గణేష్ విగ్రహం చేతిలో పాశం, లడ్డూ, అంకుశం ఉండాలి. ఒక చేయి వరదముద్రలో ఉండాలి. అలాంటి విగ్రహాన్ని పూజించాలి.

Find Next One