Spiritual
శ్రాణ పౌర్ణమి రోజున మనమందరం రాఖీ పండగ జరుపుకుంటారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరులు జీవితాంతం సంతోషంగా ఉంటారని, తమకు కూడా రక్షగా నిలుస్తారని నమ్ముతారు.
ఈసారి రక్షాబంధన్ పండుగ ఆగస్టు 19, సోమవారం నాడు వస్తుంది. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రాన్ని కూడా పఠించాలి. ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం…
యేన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామపి బధ్నామి రక్షే మా చల మా చల ||
జనేన విధినా యస్తు రక్షాబంధనమాచరేత్ |
స సర్వదోష రహితః సుఖీ సంవత్సరే భవేత్ ||
ఈ రాఖీ కట్టడం వల్ల అది నిన్ను రక్షిస్తుందని, దోషాల నుంచి నిన్ను ఏడాది పొడవునా సుఖంగా ఉంటారు అని ఈ మంత్రం అర్థమట.
రాజా బలి రాక్షసులకు రాజు. దేవత లక్ష్మీదేవి అతనికి రక్షాబంధన్ కట్టి తన సోదరుడిగా చేసుకుంది. రక్షాబంధన్ కట్టిన తర్వాత రాజా బలి విష్ణువుకు లక్ష్మీదేవిని తిరిగి ఇచ్చాడు.
పండితుల ప్రకారం, సోదరి తన సోదరుడికి విధి విధానాల ప్రకారం రక్షాబంధన్ కడితే అది అతనిని రక్షిస్తుంది. అంతేకాకుండా రాబోయే ప్రమాదాల నుండి కూడా కాపాడుతుంది.