Spiritual

పూజలో వినాయకుడికి ఇష్టమైన ఈ 7 పూలు, మొక్కలు ఉంటే మీకు సిరి సంపదలే!

దూర్వా గడ్డి

సాధారణంగా తోటలు, పచ్చిక బయళ్లలో పెరిగే ఈ గడ్డి వినాయకుడికి ఎంతో ఇష్టం. దూర్వా గడ్డి సమర్పించి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం సులభమైన మార్గం.

బంతి పూలు

వినాయకుడికి ఇష్టమైన పువ్వుల్లో బంతి పూవు ఒకటి. ఈ అద్భుతమైన పువ్వులు సానుకూల భావాలకు,  శక్తికి ప్రతీకలు.

మందార మొక్క

మందార మొక్కను చాలా శుభప్రదంగా భావిస్తారు. దీని ఎర్రటి పూలు వినాయకుడికి ఎంతో ఇష్టం. ఈ గణేష్ చతుర్థి నాడు మీరు వీటిని సమర్పిస్తే.. అభివృద్ధి, సంపదలు సమకూరుతాయి.

నీల గోకర్ణం

వినాయకుడికి నీల గోకర్ణం పువ్వు కూడా ఇష్టం. ఇది అందానికి ప్రతీక. ఆయన ఆశీస్సులు పొందాలనుకునేవారు దీనిని సమర్పించాలి.

మల్లె మొక్క

వినాయకుడి పూజకు మల్లెపూలు కూడా ఉపయోగిస్తారు. దీనికి ప్రతిరోజూ దాదాపు 6 గంటల సూర్యకాంతి అవసరం. కాబట్టి మొక్క నాటినప్పుడు తగినంత సూర్యకాంతి తగిలేలా చూసుకోండి.

పసుపు చామంతి

చాలా అద్భుతమైన పువ్వుల్లో పసుపు చామంతి ఒకటి. ఈ పువ్వులు దృష్టి దోషాలను తొలగిస్తాయి. ఇంట్లో ప్రతికూలతను కూడా దూరం చేస్తాయి.

జిల్లేడు పూలు

తెల్లని జిల్లేడు పూలలో వినాయకుడు నివసిస్తాడని నమ్ముతారు. కాబట్టి ఈ మొక్కను ప్రతిరోజూ పూజిస్తే వినాయకుడిని పూజించినట్లే.

రాఖీ కట్టేటప్పుడు అమ్మాయిలు ఏ మంత్రం పఠించాలో తెలుసా?

అయోధ్య రామ మందిరం గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

అయోధ్య రామ మందిర ఇన్విటేషన్ కార్డులో అసలు ఏం ఉందో తెలుసా?

రాముడిని ఉత్తమ పురుషోత్తముడు అని ఎందుకు అన్నారో తెలుసా?